[t4b-ticker]

ఢిల్లీలో డీకే శివకుమార్‌తో తెలంగాణ నేతల భేటీ.. కృష్ణా, తుంగభద్ర జలాలపై కీలక చర్చ

ప్రతిపక్షం, జూలై 29: ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీజలాల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.

ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగం, వాటా, నీటి నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాల మధ్య సమన్వయంతో జల వనరుల వినియోగం, సాగునీటి అవసరాలు, భవిష్యత్ ప్రాజెక్టులపై అభిప్రాయాలు పంచుకున్నారు.

అంతర్‌రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి పరస్పర సహకారం అవసరమని ఈ సందర్భంగా ఇరువైపుల నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తెలంగాణకు సంబంధించిన నీటి ప్రయోజనాలను కాపాడుతూ, పరస్పర అవగాహనతో ముందుకు సాగేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సమావేశంలో జల వనరుల నిర్వహణతో పాటు భవిష్యత్‌లో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News