ప్రతిపక్షం, జూలై 29: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తాను గత మూడున్నరేళ్లుగా పార్టీ, ప్రభుత్వం, రాజకీయ వ్యవహారాలపై ఉద్దేశపూర్వకంగానే బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించారు.
రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఏ అంశంపై అయినా ముందుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే బయట మాట్లాడుతానని స్పష్టం చేశారు.
తన మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తనకు స్పష్టమైన రాజకీయ కార్యాచరణ (పొలిటికల్ డిజైన్) సిద్ధంగా ఉందని, దానిని వచ్చే నవంబర్లో ప్రజల ముందుంచుతానని వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

















