- పెద్దికీ మెదక్ తో విడదీయారని బంధం.
- మెదక్ 2014 మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జిగా పెద్ది
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికి క్రితం మరణించారు.ఆయన మృతి చెందడంపట్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆకీ రెడ్డి కృష్ణారెడ్డి,మామిళ్ళ ఆంజనేయులు సంతాపం వ్యక్తం చేశారు.2014 లో జరిగిన మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జిగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహరించారు. మెదక్ లో గతం లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. అప్పటి మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,తో పాటు తెరాస కౌన్సిలర్లు గెలుపుకు…ఎంతో కృషి చేశారు.వుండి అందరి తో కలుపుగోలుగా ఉండి తెరాస అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేశారు.మీడియా తో వ్యక్తిగతంగా నాతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులుగా ఉన్నారు.ఆయన మరణం తెలంగాణ కు తీరని లోటు. ఉద్యమకారులకు పెద్దన్నగా వ్యవహరించారు. ఆయన మరణం తీవ్రంగా కలిచి వేస్తుంది.పెద్ఫిని బతికించేందుకు యశోద ఆసుపత్రికి మాజీ సిఎం కేసీఆర్ స్వయంగా చేరుకొని డాక్టర్ లతో మాట్లాడారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు.పెద్ది ని బతికించేందుకు మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్.. హరీష్ రావు లు చేసిన కృషి.మర్చిపోలేనిది. తెలంగాణ ఉద్యమ నేత సుదర్శన్ రెడ్డి మరణం మర్చిపోలేనిదని అయినా మృతికి సంతాపం ప్రకటిస్తున్నట్లు మెదక్ భారత రాష్ట్ర సమితి నాయకులు తెలిపారు.
కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి


















