[t4b-ticker]

‘కాళేశ్వరం అవసరం లేకుండానే ఎల్లంపల్లి నిండింది’.. బీఆర్‌ఎస్‌పై మంత్రి పొంగులేటి విమర్శలు

ప్రతిపక్షం, జూలై 31: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ తెలంగాణకు వరప్రదాయినిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందని మంత్రి తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని పొంగులేటి ఆరోపించారు. రీడిజైనింగ్, రివర్స్ పంపింగ్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకల కారణంగానే కాళేశ్వరం నేడు సమస్యలతో నిలిచిపోయిందని అన్నారు.

బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా ప్రచారం చేసినప్పటికీ, ప్రస్తుతం దాని పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ‘పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందన్న సామెత బీఆర్‌ఎస్ నేతల అవినీతికి, కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగునీరు అందుతోందని పొంగులేటి పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాలతో జలాశయాలు నిండుతున్న నేపథ్యంలో నీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News