[t4b-ticker]

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ప్రతిపక్షం, జూలై 31,వనపర్తి ప్రతినిధి: మండల కేంద్రానికి చెందిన పూసల లక్ష్మి నారాయణ (50) కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాల్ పేట్ లో (1993-94) ప‌దో త‌ర‌గ‌తి బ్యాచ్ బాల్య మిత్రులు తమ వాట్సప్ వేదికగా ఒకరికొకరు చర్చించుకుని తోచిన ఆర్థిక సహాయం అందించారు. ఇలా సమకూర్చిన 50,000 రూపాయలను లక్ష్మీ నారాయణ భార్య , కుటుంబ సభ్యులకు శుక్రవారం మండల కేంద్రంలోని మృతుని నివాసంలో అందజేశారు. మృతుని భార్య, కుమారుడు, కుమార్తె లను పరామర్శించి మన ధైర్యాన్ని కల్పించారు భవిష్యత్తులో కూడా తమవంతుగా సహాయం చేస్తామని భరోసా ను ఇచ్చారు. స్నేహితుని కుటుంబానికి అండగా నిలవడంతో పలువురు వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు వేణు గోపాల్, లక్ష్మీపతి, కవి, శ్రీనివాసులు, సాజిద్, కురుమయ్య, అంజిబాబు, తదితరులు ఉన్నారు.

Spread the love

Related News

Latest News