[t4b-ticker]

ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం

•అధికారులు కూడా అదే నిబద్ధతతో పని చేయాలి

•మరో వారం రోజుల్లో పెద్దమందడి–వనపర్తి రూ.40 కోట్ల రహదారి పనులు ప్రారంభం

•మహిళా సంఘాల రుణాల మంజూరులో నిర్లక్ష్యంపై ఏపీఎంపై ఎమ్మెల్యే ఆగ్రహం

•కేవలం 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు… మరో రూ.40 కోట్ల పనులకు శ్రీకారం

•పెద్ద మందడి మండల సర్వసభ్య సమాశంలో ఎమ్మెల్యే. మేఘా రెడ్డి

ప్రతిపక్షం, వనపర్తి ప్రతినిధి, జూలై 31: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజలకు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించబోమని వనపర్తి ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి హెచ్చరించారు.శుక్రవారం పెద్దమందడి మండల రైతువేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శాఖల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి శాఖ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే. మేఘా రెడ్డి స్పష్టం చేశారు.రూ.40 కోట్లతో పెద్దమందడి–వనపర్తి రహదారి పనులు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు.యూరియా బుకింగ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు ప్రస్తావించగా,ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతం చేయాలని,లబ్ధిదారులకు మట్టి, ఇసుక సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మహిళా సంఘాల రుణాల మంజూరులో జాప్యం జరగడంపై ఏపీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు

నియోజకవర్గంలో గత 30 నెలల్లో విద్యుత్ శాఖ ద్వారా రూ.140 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ప్రస్తుతం మరో రూ.40 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే విద్యుత్ రంగంలో వనపర్తి మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు పనిచేయాలని, లైన్‌మెన్‌లు ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.పనిచేయని వీధిలైట్లను వెంటనే మరమ్మతు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామపంచాయతీలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.అవసరమైతే సంబంధిత గ్రామపంచాయతీల బిల్లులను నిలిపివేసే చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు సూచించారు.ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేసే అధికారులను ఉపేక్షించేది లేదని, ప్రతి సమావేశంలో శాఖల పనితీరును సమీక్షించి బాధ్యత నిర్ధారిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పెద్దమందడి–ఖిల్లా ఘనపురం మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు నవనీత, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి & జిల్లా హార్టికల్చర్ అధికారి విజయభాస్కర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి యాదయ్య, ఎంఈఓ మంజుల, ఎంపీడీవో పరిణత, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News