[t4b-ticker]

రేపు స్కూళ్లకు సెలవు

ప్రతిపక్షం, ఆగస్టు 25, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రేపు ఆగస్టు 26న పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు సాధారణ సెలవును అమలు చేయనున్నాయి. దీంతో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లభించనుంది.

ఇక ఆగస్టు 28న రాఖీ పండగ సందర్భంగా ఆప్షనల్‌ హాలిడే ఉండనుంది. స్థానిక పరిస్థితులు, అధికారుల నిర్ణయాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం సాధారణంగా పనిచేయనున్నాయి.

రాఖీ పండగ నేపథ్యంలో వరుస సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగులు, విద్యార్థుల్లోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు రాఖీ పండగతో పాటు శని, ఆదివారాలు కలిసి రావడంతో వారాంతంలో సెలవుల సమయం పెరగనుంది.

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు అమలు కానుండటంతో ముందుగానే తమ కార్యక్రమాలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News