[t4b-ticker]

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలుగు రాష్ట్రాల్లో నేడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లో వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో స్థానిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Spread the love

Related News

Latest News