[t4b-ticker]

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

ప్రతిపక్షం, ఆగస్టు 26: సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనలో పలువురు మృతి చెందడం పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసరంగా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని సీఎం సూచించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.

Spread the love

Related News

Latest News