[t4b-ticker]

బంగారిగడ్డలో ఘనంగా కామ్రేడ్ నరసన్న 27వ వర్ధంతి వేడుకలు

ప్రజా ఉద్యమ నేతకు ఘన నివాళులు అర్పించిన సిపిఐ శ్రేణులు

కామ్రేడ్ నర్సన్న ఆశయాలను కొనసాగిస్తాం అని ప్రతిజ్ఞ చేసిన సిపిఐ నాయకులు.

ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 28 : చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో కామ్రేడ్ మాదగోని నర్సన్న 27వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వ‌హించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య, చండూరు మండల సీపీఐ కార్యదర్శి నలపరాజు సతీశ్‌ పాల్గొని మాట్లాడారు. పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడి మన మధ్యలో నుండి అస్తమించిన గొప్ప నాయకుడు మాదగోని నర్సన్న అని కొనియాడారు. ఈ మండలంలో దొరలు, పెత్తందారీ వ్యవస్థ పోవాలి అని ఉద్యమాలు చేసిన నాయకుడి ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామ‌ని తెలిపారు. ఈ మండలంలో ఆయన నడిచిన ఎర్రజెండాని గ్రామ గ్రామాన రెపరేపలాడిస్తామ‌ని ప్రతినపునూదామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో చండూరు మాజి జడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, బంగారిగడ్డ మాజీ సర్పంచ్ బోయపల్లి భిక్షం గౌడ్, సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి పల్లె యాదయ్య గౌడ్, నాయకులు కర్నాటి వెంకన్న, రమేశ్‌, బరిగెల వెంకటేశం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు మాదగోని అరుణ్ గౌడ్, గ్రామ కార్యదర్శి పల్లె నర్సింహ, వార్డు మెంబ‌ర్లు తలారి ముత్తయ్య, కొనరెడ్డి వెన్నెల సాయి, శ్రీశైలం, హమీద్, జక్కలి పరమేశ్‌, శివలింగయ్య, మురళి, రాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News