[t4b-ticker]

ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

ప్రతిపక్షం, ఆగస్టు 30, శామీర్ పేట: మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డు యాడారం గ్రామంలో మద్దుల నారం రెడ్డి–లక్ష్మి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కంఠం శిరీష కృష్ణారెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ హాజరై గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక మంది పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగోళ్ల హనుమాన్ దాస్, సామల జశ్వంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ సర్పంచ్ యంజాల సుజాత రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అబ్బాగౌని భాస్కర్ గౌడ్, కొమ్ము వినోద్, చిటుకుల రాజశేఖర్ రెడ్డి, పిట్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News