*హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
ప్రతి పక్షం మునుగోడు/హైదరాబాద్ ఆగస్టు 30: హైదరాబాద్ శంషాబాద్ లోని ప్రముఖ జిఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో చలమల కృష్ణారెడ్డి కుమారుడి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన మనస్పూర్తిగా ఆశీర్వదించారు. నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని, వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.చలమల కృష్ణారెడ్డి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ వివాహ మహోత్సవానికి నల్గొండ, మునుగోడు, హైదరాబాద్ ల నుండి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కన్వెన్షన్ హాల్ ప్రాంగణం అంతా సందడిగా మారింది.ఈ వివాహ వేడుకల్లో బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
































