[t4b-ticker]

పెళ్లి పేరుతో మోసం.. డాన్సర్ ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ డాన్సర్‌పై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈశ్వర్ సాయి కొంతకాలంగా తనతో సన్నిహితంగా మెలిగాడని మాధురి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా ఉపయోగించుకుని అనంతరం మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, వేములవాడలోని ఓ హోటల్‌లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉన్న సమయంలో అతడి భార్య అక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను చూసిన వెంటనే ఈశ్వర్ సాయి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. దీంతో అతడి కోసం పోలీసులు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈశ్వర్ సాయి ఆచూకీ కోసం పోలీసులు అతడి పరిచయస్తులు, కుటుంబ సభ్యులు, గతంలో ఉన్న ప్రదేశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలతో పాటు ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, పెళ్లి హామీకి సంబంధించిన ఆధారాలు, ఇతర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈశ్వర్ సాయి కోసం గాలింపు కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News