[t4b-ticker]

గ్రామకంఠం భూముల్లో అక్రమ వెంచర్ల కూల్చివేత

అనుమతులు లేకుండా ప్లాట్లుగా విక్రయాలు… చర్యలు చేపట్టిన అధికారులు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 01, శామీర్ పేట: గ్రామకంఠం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై అధికారులు ఎట్టకేలకు కొరడా ఝుళిపించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇండ్ల మధ్య లో వెంచర్ ఏర్పాటు చేసిన అక్రమ ప్లాట్లను అధికారులు కూల్చివేశారు.

మున్సిపాలిటీ నుంచి ఎలాంటి లేఅవుట్ అనుమతులు పొందకుండానే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామకంఠం భూముల్లో తెల్ల కాగితాలపై లేఅవుట్లు రూపొందించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో… నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లను ఏర్పాటు చేసి అమాయక ప్రజలను ఆకర్షిస్తూ విక్రయాలు సాగించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

స్థానికుల ఫిర్యాదులు అందడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాట్లను కూల్చివేతకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ, గ్రామకంఠం భూములను అక్రమంగా ఆక్రమించి వెంచర్లుగా మార్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు నష్టపోకుండా అధికారులు మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు

Spread the love

Related News

Latest News