[t4b-ticker]

చండూరులో అభివృద్ధి వైపు మరో అడుగు – 1వ వార్డులో డ్రైనేజీ పనులకు శ్రీకారం

*వార్డు కౌన్సిలర్ రాజకుమారి-చంద్రశేఖర్ తో కలిసి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ .

*అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం – మౌలిక వసతులకు ప్రాధాన్యత

*చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు.

ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 03: పట్టణ అభివృద్ధే ధ్యేయంగా చండూరు పురపాలక వర్గం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పట్టణంలోని 1వ వార్డు పరిధిలో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను బుధవారం ఘనంగా ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ శ్రీమతి తేలుకుంట్ల రాజకుమారి – చంద్రశేఖర్ దంపతులతో కలిసి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, చండూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ పాలక వర్గం ప్రధాన విధానమని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా 1వ వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ నూతన డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.

డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, సీసీ రోడ్ల నిర్మాణం, సురక్షిత మంచినీటి సరఫరా మరియు వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు తమ పాలక వర్గం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పూర్తి సమతుల్యత, పారదర్శకత పాటిస్తూ, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తూ చండూరును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం రమేశ్, బుషిపాక వాసు, సామ సుజాత యాదవ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఖలీల్, మొగుదాల వెంకన్న, కల్లెట్ల చంద్రకళ మారయ్య, షరీఫ్, వార్డు అధ్యక్షుడు కోయిగుర శంకర్, బెల్లంకొండ వినయ్, వార్డు ఇన్చార్జి రాంగోపాల్ మరియు ఇతర వార్డు ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News