[t4b-ticker]

మునుగోడులో రోడ్లకు మహర్దశ

*మునుగోడులో రూ.113.46 కోట్లతో రోడ్ల అభివృద్ధికి శ్రీకారం.

*గ్రామాల రోడ్లు 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్ల వెడల్పు చేయాలని నేనే ప్రభుత్వానికి విన్నవించా.

*నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే న్యాయం జరగాలి – 10 ఏళ్లు BRS పై పోరాడిన వారిని ఆదుకోవాలి.

*నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు .

*రాహుల్ గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా – కొండా సురేఖ, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానమే ఫైనల్.

*సర్వేల్ లో రోడ్లకు శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

ప్రతిపక్షం నారాయణపూర్/మునుగోడు సెప్టెంబర్ 03: యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో బుధవారం రూ.76.20 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మూడు ప్రధాన రోడ్ల అభివృద్ధి పనులకు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.

  1. నారాయణపూర్ మండలం గుడిమల్కాపూర్ నుండి చల్మెడ (వయా సర్వేల్, లింగం వారి గూడెం, సాయిగోని బావి) వరకు రూ.32.90 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు.
  2. నారాయణపూర్ నుండి సర్వేల్ వరకు (5 కిలోమీటర్లు) రూ.11 కోట్ల వ్యయంతో రోడ్డు.
  3. సర్వేల్ నుండి మునుగోడు మండలం పలివెల (వయా మల్లారెడ్డిగూడెం) వరకు రూ.32.30 కోట్ల వ్యయంతో రోడ్డు
    4.నారాయణపూర్ మండలం పొర్లగడ్డ తండా నుండి పీసీ తండా క్రాస్ రోడ్డు(వయా కొర్ర తండా) వరకు 5.20 కోట్ల వ్యయంతో
    5.పొర్లగడ్డ తండా నుండి గరిక గడ్డ తండా వరకు 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు పొర్లగడ్డ తండాలో శంకుస్థాపన…….కేలోతు తండా నుండి బండలేమునూరు వరకు 6.60 కోట్ల వ్యయంతో
    6.నారాయణపూర్ మండలం లచ్చమ్మ గూడెం నుండి గట్టుప్పల్ మండలం అంతంపేట వరకు 10.76 కోట్ల వ్యయంతో
    7.గట్టుప్పల్ మండలం అంతంపేట నుండి మర్రిగూడ మండలం శివన్న గూడెం వరకు 13.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు అభివృద్ధి పనులకు అంతంపేటలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన లు చేశారు .
    ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో గ్రామాల మధ్య రోడ్లు 3.75 మీటర్ల వెడల్పుతో ఉండేవని, ప్రస్తుతం రవాణా సౌకర్యాలు మెరుగై ప్రతి గ్రామంలోకి కార్లు, బైకులు, బస్సులు వస్తున్న నేపథ్యంలో ఆ రోడ్లను 5.5 మీటర్ల వెడల్పు చేయాలనే ఆలోచనను తానే ప్రభుత్వానికి విన్నవించానని, ప్రజా ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. ఈ రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తన సోదరుడు ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గార్ల సహకారం వల్లే సాధ్యమైందన్నారు. రోడ్ల నిర్మాణంలో గ్రామస్థులు, మీడియా మిత్రులు, జర్నలిస్టులు, అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. త్రిబుల్ ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు ఎక్కువ నష్టపరిహారం చెల్లించేలా చొరవ తీసుకున్నానని తెలిపారు.

*నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలి – ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తన ఆలోచనంతా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించేనని, పది సంవత్సరాలపాటు BRS పైన పోరాటం చేసిన నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలనేది తన ఉద్దేశమని స్పష్టం చేశారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరగొద్దన్నారు. ఎవరికి ఏం పదవులు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని, తన నాయకుడు రాహుల్ గాంధీపై నమ్మకం ఉందని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కొండా సురేఖ అంశం, మంత్రివర్గ విస్తరణ అంశం అధిష్టానం దగ్గర ఉందని, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News