[t4b-ticker]

7వ డివిజన్ లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

ప్రతిపక్షం రామగుండం (ప్రతినిధి) సెప్టెంబర్ 10: రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు నగర మేయర్ మహంకాళి స్వామి సూచనలతో 7వ డివిజన్ లో గురువారం స్థానిక కార్పొరేటర్ వేగోళపు రమాదేవి-శ్రీనివాస్ గౌడ్ ( గంగ శ్రీను) ఆధ్వర్యంలో డివిజన్ ఇంచార్జ్ బెందె నాగభూషణం గౌడ్ సహకారంతో 1000 రోజుల సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్పోరేటర్ రమాదేవి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,ప్రతి గృహానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు,120 కోట్లతో రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్,230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్,8 కోట్లతో పీజీ సెంటర్ కు నూతన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్,ప్రభుత్వ ఆసుపత్రిలో 600 బెడ్స్ కోసం 200 కోట్లతో ఆరంతస్తుల భవన నిర్మాణం మరియు కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్లో నూతనంగా రోడ్లు వేస్తున్నారని,తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం నియోజకవర్గంను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.

అలాగే సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది నుండి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు దసరా కానుకగా ₹5000 బోనస్ ను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జి కాల్వ లింగస్వామి,రవి కుమార్,ఓదెలు యాదవ్, గోపగోని సతీష్ జనగామ వినోద్,జంగిలి రాజేష్,ఎండీ ఆరిఫ్,అవునూరి సంజీవ్,పుట్ట నాగరాజు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News