Trending Now

నియోజక వర్గంలో దుబ్బాక ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన..

ప్రతిపక్షం, దుబ్బాక, ఏప్రిల్ 24: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని పలు వివాహాలకు, ఆలయ ఉత్సవాలకు హాజరయ్యారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో టీటీడీ ఫంక్షన్ హల్లో జరిగిన మద్దెల స్వప్న-యాదయ్య కుమార్తె సాద్విక – కిరణ్ కుమార్ పెళ్లికి హాజరై వధూవరుల ను ఆశీర్వదించారు. అల్వాల లో జరుగుతున్న గంగమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అల్వాల జయ విజయ ఫంక్షన్ హల్లో వెంకట్రావుపేట కు చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు నాగులపల్లి యాదగిరి పెళ్లి కి, అందెలో బీఆర్ఎస్ యువ నాయకుడు జక్కుల రాజు- పవిత్ర పెళ్లికి, తొగుట మండలంలోని పెద్ద మసాన్ పల్లిలో జరిగిన వెంకట్రావుపేట కు చెందిన గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య కుమారుడు గణేష్ పెళ్లి కి, బొదాసు కనకయ్య కుమారుడు మధు పెళ్లి కి హాజరై వధూవరుల ను ఆశీర్వదించారు. గుడికందుల లో జరుగుతున్న మహంకాళి అమ్మవారి వార్షికోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ్వెల్ మండలంలోని చిన్న అరెపల్లి లో జరుగుతున్న గ్రామ దేవతల బొడ్రాయి పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News