46 people death during ‘Jivitputrika’ festival in Bihar: బీహార్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. జివుతియా పండుగ వేడుకల్లో పలు జిల్లాల్లో జరిగిన అపశృతిలో దాదాపు 46 మంది మృతి చెందగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇందులో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 15 జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్నానాలు చేస్తుండగా జరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 46 మంది మృత దేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ‘జీవిత్పుత్రిక’ పండుగ చేసుకుంటున్నారు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతో పాటు పిల్లలతో కలిసి నదులు, చెరువుల్లో పవిత్ర స్నానాలు చేయిస్తారు. తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్గంజ్, అర్వాల్ జిల్లాల్లో మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి.