ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్వాడీ టీచర్ దారుణ హత్యకు గురయ్యారు. కాటాపురం గ్రామానికి చెందిన సుజాత అంగన్వాడీ టీచర్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో సుజాత మృతదేహాం కనిపించగా కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసి హతమార్చి ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం, సెల్‌ఫోన్ దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.