Trending Now

Ayushman Bharat: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.5లక్షల వరకు ఉచిత చికిత్స

Senior citizens above 70 to be covered under Ayushman Bharat: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 70ఏళ్లు, అంతకు మించిన వయస్కులైన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బుధవారం ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోదం దక్కింది.

ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్స అందించనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగున్నర కోట్ల కుటుంబాలకు చెందిన మొత్తం 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు క్యాబినేట్..పీఎం గ్రామ సడక్ యోజన, పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ వంటి పథకాలకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

Spread the love

Related News

Latest News