CM Revanth Reddy Says Good News To Unemployed: ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదన్నారు. ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడమని, త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు.
అయితే, టీజీపీఎస్సీ వెబ్సైట్లో 30లక్షల మంది నమోదు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలో మరో 35వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని సీఎం అన్నారు.