ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 8 : ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంతాపం తెలిపారు. వ్యాపారవేత్తగా, ఈనాడు మీడియా సంస్థల, అధిపతిగా, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రామోజీ రావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. రామోజీ రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వయం కృషితో ఎదిగిన గొప్ప దార్శనికుడని రామోజీ రావు ను స్మరించుకున్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.