Trending Now

తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్..

ప్రతిపక్షం, సిద్దిపేట మే 3: తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట లో చేసిన వ్యాఖ్యలు అసంబద్దమైనవని అన్నారు. రేవంత్ రెడ్డి కి దేవుడి శాపాలు పెట్టారనీ, ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడడని విమర్శించారు. సిద్దిపేట అభివృదిలో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు లు సాధించిందన్నారు. సిద్దిపేట పేరు లేకుండా అవార్డులు రాలేదన్నారు. సిద్దిపేటకు తాము ఏం చేయలేదో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట కి మెడికల్ కళాశాల, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఐటీ హబ్, రైతు బజార్ ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పారు.

రేవంత్ రెడ్డి రాజీనామాకి సిద్ధమా లేకుంటే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా సవాల్ చేశారు. వంద రోజులు లో గ్యారంటీ లు అమలు చేస్తే తాను స్పీకర్ పార్మాట్ లో రాజీనామా ను ఆమోదింప చేసుకుంటానని అన్నారు. బీజేపీ నాయకులు దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారన్నారు. కాంగ్రెస్ పిచ్చి ప్రయత్నం వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేల్ అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూమి కొనేవారు లేకుండా పోయారనీ తెలిపారు. రాష్ట్రం దివాలా తీసింది ఆని లేని అప్పులు చూపెట్టడం వల్ల నేడు రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. ఉద్యోగాలు రాకుండా పోయాయని, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు.

రిజర్వేషన్లు పోతాయని రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నాడని అన్నారు. హిందువుల ఆస్తులు పోతాయని మోడీ అంటున్నాడని, హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ ప్రజలు ఊరుకోరన్నారు. ప్రజలను సెంటిమెంటల్ గా రెచ్చగొట్టి కాంగ్రెస్, బీజేపీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోడీ అంటున్నారు. అది నిజమైతే ఈడీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో రేవంత్ రెడ్డి మాటల్లో అంతా నిజం ఉంటదన్నారు. కేసీఆర్ ఇచ్చిన సిద్దిపేట వెటర్నరీ కాలేజ్ ని గద్ద లాగా కొడంగల్ కి రేవంత్ రెడ్డి లాక్కొని పోయాడని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ను రద్దు చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు.

Spread the love

Related News

Latest News