Trending Now

విద్యుత్ ఉద్యోగులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 18: ప్రజల నిత్య అవసరమైన విద్యుత్తును సరఫరా చేయడంలో నిత్యం పని ఒత్తిడిలో ఉండే విద్యుత్ ఉద్యోగుల కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారు ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు విద్యుత్ శాఖ ఎస్ ఈ మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం సిద్దిపేటలో ఎస్ఈ కార్యాలయంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు, సిబ్బందికి కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మోనోలజీ స్క్రీనింగ్ తో పాటు, బీపీ చెక్ అప్, బ్లడ్ షుగర్, ఈసీజీ, టు డిఇగో, బోనే మినరల్ డెన్సిటీ, పి ఎఫ్ టి టెస్టులను నిర్వహించినట్లు తెలిపారు. సుమారుగా 200 మంది వరకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. డాక్టర్ సత్య సుధిష్, డాక్టర్ సోమేశ్ మంజునాథ్, డాక్టర్ అమర్, వినయ్ కుమార్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాధికలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఈ లు శ్రీనాథ్ మహేష్, ఏడిఈలు గంగాధర్ సంతోష్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News