ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, మే 29: అందంగా నిర్మించుకుంటున్న ఆ భవనంలో జీవితం సంతోషంగా గడుపుదామనుకున్న ఆ హెడ్ కానిస్టేబుల్ కోరిక తీరలేక పోయింది. ఇంటికి నీళ్ళు కొడుతూ కాలు జారి పడి మృతి చెందటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నిజామాబాద్ నగరం 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి సాయినగర్ (వర్ని రోడ్) లో నూతనంగా భవనం నిర్మిస్తున్నాడు. కాగా, బుధవారం నూతనంగా నిర్మిస్తున్న భవనం ఒకటవ అంతస్తులో పైపుతో నీరు కొడుతుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారిపడి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 5వ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.