హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: గాంధీభవన్లో బుధవారం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం, నారీ న్యాయ్ సమ్మన్ సమ్మరో, ,మహిళా స్టేట్ ఎక్స్పెక్టింగ్ ఘనంగా జరిగాయి. ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగారాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పిసిసి కార్యనిర్వాహ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నీలిమ, పిసిసి అధికార ప్రతినిధి భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా అభల కాదు సభల ఆదిశక్తీ మహీశూరమర్థిని అని అన్ని రంగాలలో దూసుకుపోతుదని ఒక లెజెండ్ గా పని చేస్తుదని సునీత రావు అన్నారు. ఏసిసి అధినేత్రి సోనియా గాంధీ మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి స్కీం కింద 6 గ్యారంటీలను అమలు చేస్తూ.. మహిళలకు ఇంకా ఎన్నో పథకాలను తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో జిల్లా ప్రెసిడెంట్స్, స్టేట్స్ ఆఫీస్ బేరర్స్ అందరూ బాగా పనిచేయాలని, 17 పార్లమెంటు స్థానాలను గెలుచుకుని కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని సూచించారు.