Trending Now

Mamata Banerjee: రాజీనామాకు సిద్ధమే.. సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee Ready to resign: పశ్చిమ బెంగాల్‌ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్‌ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

ఆర్జీ కర్‌ వైద్యులతో సమావేశం కోసం దాదాపు 2 గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. చాలా మంది వైద్యులు చర్చలకు సిద్ధంగా ఉన్నారని, కానీ కొంతమంది ప్రతిష్టంభన కొనసాగించాలని సూస్తున్నారన్నారు. అలాంటి వారికి న్యాయం అవసరం లేదని, నును కుర్చీ దిగడమే కావాలన్నారు.

Spread the love

Related News

Latest News