Trending Now

స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేసిన రాష్ట్ర డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి

ప్రతిపక్షం, మంథని, మే 18 : ఈవీఎం యంత్రాలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ లను రాష్ట్ర డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి మురళీ మోహన్ రావు.. పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ తో కలిసి తనిఖీ చేశారు. శనివారం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి మురళీ మోహన్ రావు రామగిరిలోని సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలలో రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూములకు వేసిన సీల్ లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్ లో సంతకం చేశారు. అదే విధంగా జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, కెమెరా మానిటరింగ్ వివరాలను
అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ప్రక్రియ జేఎన్టీయు రామగిరి కళాశాలలో జరుగుతుందని, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలైన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపర్చామని, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 3 అంచెల పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూమ్ పూర్తి కవరేజతో సీసీ కేమేరాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా స్ట్రాంగ్ రూమ్ లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ‌సహాయ రిటర్నింగ్ అధికారి వి.హనుమా నాయక్, తహసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News