Trending Now

మున్సిపల్ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర్‌ను ఆహ్వానించిన నేతలు

ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 11: తెల్లాపూర్ మున్సిపల్ పరిపాలన భవనం ప్రారంభోత్సవము ఈనెల 20వ తేదీన నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఎమ్మెల్యే జీఎంఆర్ నేతృతంలో మున్సిపల్ పాలకూరకం సభ్యులు మంత్రి దామోదర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. ఆధునిక వసతులతో.. విశాల ప్రాంగణంలో.. పరిపాలనకు అనుగుణంగా మున్సిపల్ భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈనెల 20వ తేదీన మున్సిపల్ భవనం ప్రారంభోత్సవంతో.. గద్దర్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమలను మంత్రి దామోదర చేతుల మీదుగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News