371 more posts in medical department: వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రేవంత్ సర్కార్ ఇటీవల 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా, దీనికి సంబంధించిన మరో 272 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను కలిపింది. దీంతో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 2,322కి చేరినట్లయింది.అలాగే గతంలో ప్రకటించిన 633 ఫార్మసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నర్సింగ్ పోస్టులకు ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. నవంబర్ 17న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అలాగే ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించగగా.. నవంబర్ 30న పరీక్ష నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.