ప్రతిపక్షం, జూన్ 16: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 బాంబర్ విమానం ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 8 మంది సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాంబర్ విమానాల్లో ఒకటైన B-52 ఒకేసారి 31,500 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.















