ప్రతిపక్షం, జూన్ 17: టీ–20 లీగ్‌తో అనుబంధం కలిగిన సినీ, క్రీడా రంగ ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ సంఘం న్యాయపరమైన నోటీసులు జారీ చేసింది. లీగ్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండగా, ఆ ప్రక్రియ పూర్తికాకుండానే లీగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించింది.
అలాగే క్రికెట్ సంఘం అనుమతి లేకుండా కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని నిధుల సేకరణ జరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో లీగ్‌కు సంబంధించిన ఒప్పందాలు, ప్రచార కార్యక్రమాలను పునఃసమీక్షించుకోవాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

















