ప్రతిపక్షం, జూన్ 18: తన తాజా చిత్రం మా ఇంటి బంగారం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చెన్నై వెళ్లిన ప్రముఖ నటి సమంత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
సమంత, విజయ్ గతంలో పలు విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. వారి కలయిక మరోసారి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సమావేశానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాగా, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

















