ప్రతిపక్షం, జూన్ 27: తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. స్క్రీన్‌ప్లేలో తనదైన ముద్ర వేసిన ఆయనను భారతీయ సినీ పరిశ్రమలో “కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే”గా గుర్తిస్తారు. కెరీర్లో 75కి పైగా చిత్రాల్లో నటించి, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అవునా, మేం వయసుకు వచ్చాం, రెడ్ అలర్ట్, సీత తదితర చిత్రాల్లో నటించిన ఆయన, ఇటీవల విడుదలైన కుబేర చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించారు.

















