కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్ ఇవే

ప్రతిపక్షం, జూలై 20: ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు చేసింది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. నీట్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరింది.

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ హెచ్చరించింది. నీట్‌ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నీట్‌ పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని సీజేపీ కోరింది. తమ డిమాండ్లపై కేంద్రం తక్షణమే స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని పార్టీ నేతలు హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News