రష్యా దాడిలో నలుగురు భారతీయుల మృతి.. రష్యా రాయబారికి భారత్ సమన్లు

ప్రతిపక్షం, జూలై 21: ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టులో కార్గో నౌకపై రష్యా జరిపిన దాడుల్లో నలుగురు భారతీయులు మృతి చెందడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ భారత్‌లోని రష్యా దౌత్యవేత్త వ్లాదిమర్ లడనోవ్‌కు సమన్లు జారీ చేసింది.

వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులను అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతీయ నావికులు మృతి చెందడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఘటనపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Spread the love

Related News

Latest News