మెలోని పోస్టుకు వైరల్ కామెంట్.. సోషల్ మీడియాలో దుమారం

ప్రతిపక్షం, జూలై 23: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై కొందరు నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో స్పందిస్తూ ఓ నెటిజన్.. “మీ బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పండి.. విద్యార్థుల సమస్యలు వినమని” అంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ కామెంట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ నేతల సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి దేశ అంతర్గత రాజకీయ అంశాలను ప్రస్తావించడం సరైందికాదని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు, ఇది వ్యక్తిగత అభిప్రాయమేనని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కలిసి కనిపించిన సందర్భాల తర్వాత ‘మెలోడీ’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పలు ఫన్నీ పోస్టులు, మీమ్స్ విస్తృతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News