[t4b-ticker]

ఫోన్ పోయిందా? వెంటనే ఇలా బ్లాక్‌ చేసి ట్రాక్‌ చేయండి

ప్రతిపక్షం, ఆగస్టు 26, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంచార్ సాథీ సేవ ద్వారా ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా పరికరాన్ని బ్లాక్‌ చేయడంతో పాటు, దాని స్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చు.

ఫోన్‌ పోయిన వెంటనే ముందుగా మీ సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది. అనంతరం సీఈఐఆర్‌ సేవలో ఫోన్‌ ఐఎంఈఐ వివరాలు నమోదు చేసి పరికరాన్ని బ్లాక్‌ చేయవచ్చు. ఫోన్‌ తిరిగి లభించినప్పుడు ఇదే సేవ ద్వారా బ్లాక్‌ను తొలగించే అవకాశం ఉంటుంది.

అలాగే మీ పేరుపై ఎన్ని సిమ్‌ కార్డులు నమోదయ్యాయో తెలుసుకోవడానికి టీఏఎఫ్‌సీఓపీ సేవను ఉపయోగించుకోవచ్చు. మీకు తెలియకుండా మీ పేరుతో నమోదైన మొబైల్‌ నంబర్లు ఉంటే వాటిపై ఫిర్యాదు చేసి వాటిని డిస్‌కనెక్ట్‌ చేయించుకోవచ్చు.

ఫోన్‌ పోయిన సందర్భంలో ఆలస్యం చేయకుండా సిమ్‌ భద్రత, బ్యాంకింగ్‌ యాప్‌లు, ఈమెయిల్‌, సామాజిక మాధ్యమ ఖాతాల పాస్‌వర్డ్‌లను కూడా సురక్షితంగా మార్చుకోవడం మంచిది.

Spread the love

Related News

Latest News