[t4b-ticker]

కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

మెదక్ లో భారీ ర్యాలీ రాస్తారోకో

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 02: కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులలో హామీలను అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎనిమిది రోజులపాటు కాంగ్రెస్ పార్టీ 420 హామీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆరు గ్యారెంటీ బతకాలతో పాటు 420 హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి. మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు కృష్ణారెడ్డి తో పాటు బట్టి జగపతి పట్టణ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు కృష్ణ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్లు ఉదయ్ దీపక్ కుమార్. జుబేర్. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News