[t4b-ticker]

ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు చేస్తాం.

కోట్ల రూపాయల బియ్యం వ్యవహారంలో కఠినంగా చర్యలు.

మెదక్ జిల్లాలో 115 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా ధాన్యం పై రైస్ మిల్లర్ లు బాకీ.

ప్రభుత్వం ఇచ్చిన ప్యాడిని తిరిగి ఇవ్వమంటే మిల్లర్లు ప్రెస్ మీట్ ఎందుకు.?

మెదక్ జిల్లా సివిల్ సప్లై డిఎం జగదీశ్వర్.

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 05: కోట్ల రూపాయల బియ్యం వ్యవహారంలో ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వానికి రావలసిన బకాయిలు చట్టరీత్యా వసూలు చేస్తామని, 115 కోట్లకు పైగా రూపాయల బియ్యం రావాల్సి ఉందని వీటిపై మిల్లర్లు నిజాయితీగా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేది ? లేదా? అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఏమాత్రం రైస్ మిల్లర్ లు తికమకలు చేసిన కఠినంగా వ్యవహరిస్తామని సివిల్ సప్లై డిఎం జగదీష్ రైస్ మిల్లర్ లను హెచ్చరించారు.

శనివారం నాడు తెలిపిన ప్రకటనలో రైస్ మిల్లర్స్ ప్రభుత్వానికి రావలసిన ధాన్యాన్ని ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ప్రెస్ మీట్ లు ఇవ్వడం మానుకొని ప్రభుత్వం ఇచ్చిన దాన్యంపై దృష్టి పెట్టి రావాల్సిన ధాన్యాన్ని సరి అయిన సమయంలో ప్రభుత్వానికి అప్పజెప్పాలని లేనిపక్షంలో కఠిన వ్యవహరించి చట్ట ప్రకారం వసూలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బియ్యం వ్యవహారంలో అక్రమాకులకు అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. మిల్లులో ఉన్న ధాన్యం బియ్యం, నిల్వలు రికార్డులు, ప్రభుత్వానికి అప్పగించిన సీఎం ఆర్ వివరాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులు విచారణ జరిపి సమయంలో రైస్ మిల్లర్ సహకరించాలని కోరారు. తనిఖీలు నిలిపివేయడం కొరకు రైస్ మిల్లర్ అసోసియేషన్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

మెదక్ జిల్లాలో భారీ అక్రమాలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయని ఇప్పటికే పలు రైస్ మిల్లర్ల పై కేసులు చేశామని తెలిపారు. బియ్యం అప్పగింతలు జాప్యం నిల్వలా వ్యత్యాసాలపై అధికారులు దృష్టి సాధించినట్లు తెలిపారు. తనిఖీలలో అనుమానాస్పద అంశాలను బయటకు వస్తున్నాయని వివరించారు. అక్రమార్కులు బయటపడే సంబంధిత రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉంటుందని, కొందరు రైస్ మిల్లర్ యూనియన్ నాయకులు చర్యలు తీసుకోకుండా అధికారులు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు .అసలు అక్రమాలు జరుగుతుంటే తనిఖీలకు విచారణకు ఏం భయపడుతున్నారని ప్రశ్నించారు. విచారణ పూర్తయితే అసలు లెక్కలు తేలే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఎంత మిల్లులో ఉన్న నిలువలు ఎంత, రికార్డులో చూపుతున్నది ఎంత వాస్తవంగా ప్రభుత్వానికి చేరేది ఎంత అనే అంశాలపై సమగ్ర విచారణ జరుగుతున్నది కోట్లు విలువైన బియ్యం వ్యవహారంలో వాస్తవాలు వేరులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైస్ మిల్లర్ లు తమపై కఠినమైన చర్యలు తీసుకోకుండా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో పలు రైస్ మిల్లుల యజమానులను కేసులు చేసి జైలుకు వెళ్లారని అన్నారు. అయినా ప్రభుత్వానికి రావాల్సిన దాన్యంపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News