[t4b-ticker]

దద్దరిల్లిన నకిరేకల్ బహిరంగ సభ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు.

ప్రతి పక్షం మునుగోడు/నకిరేకల్ సెప్టెంబర్ 05: నకిరేకల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ సభకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ లో 200 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. పాత వాసవి కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి పన్నాలగూడెం వరకు భారీ ర్యాలీగా బయలుదేరి మినీ ఔట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. దాదాపు 60 వేల మందితో సభ దద్దరిల్లింది.

ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించగానే సభ మార్మోగిపోయింది.ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.”కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడాన్ని స్వాగతిస్తాను. కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతామంటే మాత్రం ఊరుకోను. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారు. మునుగోడు, నకిరేకల్, నల్గొండ ఎక్కడైనా కార్యకర్తలకు అండగా రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగమే” అని ఆయన స్పష్టం చేశారు.క్యాబినెట్ విస్తరణపై మాట్లాడుతూ నిర్ణయం పూర్తిగా హైకమాండ్ దేనని, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, కలెక్టర్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News