[t4b-ticker]

యాదవ్ సేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడి ప్రతిష్ట మహోత్సవం

ప్రతిపక్షం చండూరు సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చండూరు మండలంలోని చొప్పరి వారి గూడెం గ్రామంలో యాదవ్ యువసేన ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవం ఘనంగా జరిగింది.గ్రామంలో యాదవ్ సేన యూత్ ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక అలంకరణలు చేసి, మామిడి తోరణాలు, పూల మాలలతో మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా గ్రామంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, విఘ్నాలు తొలగిపోవాలని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో చొప్పరి హరికృష్ణ, మౌనిక, చొప్పరి శంకర్, ప్రవీణ్, లింగస్వామి, మండల హనుమంత్, అరుణాచలం మరియు యాదవ్ యువసేన యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News