తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు ఘన నివాళులు .
వారి త్యాగాలు నేటి తరానికి ఆదర్శం – బీజేపీ నేతలు
దేశాభివృద్ధి ప్రదాత మోదీకి జన్మదిన శుభాకాంక్షలు – కేక్ కట్ చేసి సంబరాలు.
మోదీ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం – సామాజిక బాధ్యత చాటుకున్న యువత, కార్యకర్తలు.
ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 17: చండూరు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ విమోచనం కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి పోరాట స్ఫూర్తిని నాయకులు గుర్తు చేశారు.
అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మోదీ గారు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపారని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. చివరగా సేవా పక్షోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు యువత, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చామలపల్లి సర్పంచ్ ముదిగొండ రామాంజనేయులు, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు భూతరాజు శ్రీహరి,బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా కార్యదర్శి వరికుప్పల గిరి, బొబ్బల మురళి మనోహర్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, అన్నెపర్తి యాదగిరి, బోడ ఆంజనేయులు, సముద్రాల వెంకన్న, తడకమల్ల అశ్విని శ్రీధర్, సామ వెంకట్ రెడ్డి, దోటి కిరణ్, పేర్ల గణేష్, పడసనబోయిన శ్రీను, ఆవుల అశోక్, సోమ శంకర్, ఏనుగు వెంకట్ రెడ్డి, పల్లెపు స్వామి, కడారి నర్సింహా, నలపరాజు యాదగిరి, కట్కూరి రామలింగయ్య, వరికుప్పల వెంకన్న, నిమ్మల వెంకన్న, నలపరాజు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.































