Trending Now

IPL 2024 : నేడు గుజరాత్‌‌తో సన్ రైజర్స్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నేడు ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌ జట్టుపై సన్ రైజర్స్ గెలిస్తే 16 పాయింట్లు దక్కించుకుంటుంది. కేకేఆర్, ఆర్ఆర్ ఇప్పటికే క్వాలిఫై అయ్యాయి. ప్లే ఆఫ్స్‌‌లో స్థానం కోసం పోరాడుతున్న మిగతా జట్లలో కేవలం సీఎస్కే మాత్రమే 16 పాయింట్లకు చేరగలదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఈరోజు గెలిచి సునాయాసంగా ప్లే ఆఫ్స్‌ వెళ్లాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన సన్ రైజర్స్ కు 14 పాయింట్లు ఉన్నాయి.

రాజస్థాన్‌పై పంజాబ్ విజయం..

రాజస్థాన్‌ రాయల్స్‌తో ఈరోజు జరిగిన స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సునాయాస విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సామ్ కరన్ (63 నాటౌట్), రుసో(22) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.

సన్ రైజర్స్‌కి గోల్డెన్ ఛాన్స్..

నిన్న రాత్రి RR ఓడిపోవడంతో SRHకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. హైదరాబాద్‌కు మరో 2 మ్యాచులు ఉన్నాయి. రెండూ గెలిస్తే జట్టు మొత్తం పాయింట్లు 18కి చేరతాయి. ఆర్ఆర్‌ తర్వాతి మ్యాచ్ గెలిచి 18 పాయింట్స్‌కు చేరుకున్నా.. వరసగా రెండు మ్యాచులు గెలిచిన హైదరాబాద్‌కంటే రన్‌రేట్‌లో వెనుకబడే ఉంటుంది. దీంతో SRH లీగ్ దశను రెండో స్థానంలో ముగించే అవకాశముంది. తొలి 2 స్థానాల్లోని జట్లకు ఫైనల్ చేరేందుకు 2 ఛాన్సులుంటాయి.

Spread the love

Related News

Latest News