తెలంగాణ జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
ఘనంగా తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం
ప్రతిపక్షం, ప్రతినిధి సిద్దిపేట, జూన్ 11: 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తిగా ఎదిగేందుకు భారత్ కు పుష్కల అవకాశాలు ఉన్నాయని, ఇది వికసిత్ భారత్ ద్వారా సాధ్యం అవుతుందని, అందులో యువత ప్రముఖ పాత్ర పోషించాలని తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు లో జూన్ 11వ తేదీన జరిగిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. భారత స్థూల జాతీయోత్పత్తికి 18% పైగా వ్యవసాయమే ఆధారమైన నేపథ్యంలో మరింత వృద్ధిరేటుకై ప్రభుత్వం సహజ, సేంద్రియ వ్యవసాయానికి మరింత మద్దతునిస్తుందని తెలిపారు. వ్యవసాయంతోపాటు ఉద్యాన అటవీ రంగాలకు ప్రాధాన్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 70% పైగా గ్రామీణులకు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే అని, 82 శాతం పైగా చిన్న సన్నకారు రైతులే అని పేర్కొన్నారు. విద్యార్థులు విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని కష్టాలు ఎదురైతే విరామం ఇవ్వచ్చు కానీ వెనుక తిరిగొద్దని గవర్నర్ పిలుపునిచ్చారు. పెద్దగా ఆలోచించాలని వాటిని చేరుకునేందుకు ఆరంభం సైతం చేరువ అంతే పెద్దగా ఉండాలని అన్నారు. ప్రపంచంలో అబ్రహం లింకన్, నరేంద్ర మోడీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారని, పేదరికం ఆకలి బాధతో కొట్టుమిట్టాడుతున్న జనాలకు వాటి నుంచి విముక్తి కల్పించిన గొప్ప వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని గవర్నర్ పేర్కొన్నారు. చదువుతో సహా ప్రతి అంశంలో నాణ్యతను చూపించినట్టయితే విజయం తధ్యమని అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు రాజ్ భవన్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు.
తరుగుతున్న సాగు నేల, సహజ వనరులు, పంటల ఉత్పాదకత అలాగే పర్యావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర ఆహార, పోషక భద్రత సాధించడంతోపాటు సూపర్ ఎకానమిక్ పవర్ గా భారత్ ఎదిగేందుకు టెక్నాలజీ ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.గీతాలక్ష్మి అన్నారు. స్నాతకోత్వానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ…. ప్రెసిషన్ ఫామింగ్, బిగ్ డేటా, కృత్రిమ మేదస్సు, రోబోట్స్, డ్రోన్స్, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని రైతులకు పరిచయం చేయాలని, దాని ద్వారా పంటల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె అన్నారు. పంట కోతనంతరం 20 నుంచి 30 శాతం దిగుబడి నష్టం జరుగుతున్న నేపథ్యంలో, పంట ఉత్పత్తుల మేలైన నిల్వలకు కావాల్సిన సదుపాయాల్ని కల్పించుకోవాలని అన్నారు.
స్పీడ్ బ్రేకింగ్ ఉంటాయి ఆధునిక పరిజ్ఞానంతో తక్కువ వ్యవధి ఉండే నూతన రకాల అభివృద్ధి రెండు మూడు సంవత్సరాల్లోనే పూర్తవుతుంది అన్నారు. జీన్ ఎడిటింగ్, జీన్ పిరమిడ్ పద్ధతుల ద్వారా చలిని, అధిక వేడిని, నీటి ఎద్దడిని తట్టుకునే పంట రకాల రూపకల్పన సుసాధ్యమని పేర్కొన్నారు. ఉపాధి కోసం ఎదురుచూసే వ్యక్తిగా కంటే ఉపాధి కల్పించే శక్తిగా విద్యార్థులు ఎదగాలని డాక్టర్ గీతా లక్ష్మి పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ, ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు పుష్కల భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులు దృష్టి సారించాలని నైపుణ్యభారత్ కు సైతం ఇది దోహదం చేస్తుందని ఆమె తెలిపారు. కష్టపడే లక్షణం విద్యార్థులు అలవర్చుకుంటే విజయం తప్పక వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ శ్రీమతి బి. నీరజ ప్రభాకర్ స్వాగత ఉపన్యాసం, అలాగే అభివృద్ధి నివేదికను గవర్నర్ కు విన్నవించారు. మేలైన ఉద్యాన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందిస్తుందని, అలాగే క్షేత్రస్థాయిలో రైతులకు సాంకేతిక సలహాలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆమె తెలిపారు. తెలంగాణలో రైతులు సాగు చేస్తున్న బాలనగర్ సీతాఫలం, ఆర్మూరు పసుపు తోపాటు మరికొన్ని స్థానిక పంటలకు భౌగోళిక గుర్తింపు, రైతు వంగడాల రిజిస్ట్రేషన్, పామ్ ఆయిల్ పై పరిశోధనలు, ప్రధాన ఉద్యాన పంటల్లో సేంద్రీయ సాగు, నూతన రకాల అభివృద్ధి ఆమె తెలిపారు. రైతులకు శాస్త్రీయతతో కూడిన ఉద్యాన దర్శిని ప్రచురణతో పాటు గ్రామాల దత్తత, విస్తరణ కార్యక్రమాల ద్వారా రైతులకు నూతన ఉద్యాన పరిజ్ఞానాన్ని అంద అందజేస్తున్నట్లు డాక్టర్ నీరజ ప్రభాకర్ తెలిపారు.
విద్యార్థులకు బంగారు పతకాల ప్రధానం..
బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ లో అత్యధిక ఓజిపిఏ సాధించినందుకు గాను 2023 బ్యాచ్ కు చెందిన ఆర్. వరలక్ష్మి మూడు బంగారు పతకాలు అందుకున్నారు. బిఎస్సి హానర్స్ ఫారెస్ట్రీలో పిసిసిఎఫ్ గోల్డ్ మెడల్ కె. రవళి, deans గోల్డ్ మెడల్ కె. ప్రత్యూష అందుకున్నారు. ఎమ్మెస్సీ హార్టికల్చర్ లో అన్ని విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను ఎస్కేఎల్ టి ఎస్ హెచ్ గోల్డ్ మెడల్, అలాగే విద్యార్థినిలలో అత్యధిక మార్కులు సాధించినందుకు గాను, ఇంకా కూరగాయల విభాగంలో టాపర్గా నిలిచినందుకుగాను గాను ఎం.మాళవిక మూడు గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. పండ్ల శాస్త్ర విభాగంలో జిఎస్ దివ్య, పూల శాస్త్ర విభాగంలో పీ. విద్య శ్రీ, అలాగే ఔషధ, సుగంధ ద్రవ్య పంటల విభాగంలో పి.మహేశ్వరి గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రధానం..
ఈ మూడవ స్నాతకోత్సవంలో 156 మంది కి ఉద్యాన డిగ్రీ, 50 మందికి ఫారెస్ట్ డిగ్రీ, 45 మందికి ఉద్యాన పీజీ, 30 మంది ఫారెస్ట్ పీజీ, అలాగే మరో ఆర్గుకి పీహెచ్డ్ డాక్టరేట్ పట్టాలు ప్రధానం. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి వర్సిటీ registrar డాక్టర్ ఏ భగవాన్, డీన్ డాక్టర్ ఎం. రాజశేఖర్, పరిశోధన సంచాలకులు డాక్టర్ కిరణ్, డిఎస్ఏ డాక్టర్ విజయ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శ్రీనివాసన్, ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, బోర్డు మెంబర్ డాక్టర్ ఆర్కే మాథూర్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.