ఆధార్-రేషన్ అనుసంధాన గడువు పెంపు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆధార్-రేషన్ కార్డు అనుసంధాన గడువును కేంద్రం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. జూన్ 30తో గడువు ముగియనుండగా మరో 3 నెలలు పొడిగించింది. రేషన్ కార్డుల దుర్వినియోగం నేపథ్యంలో అవకతవకలు అరికట్టేందుకు కేంద్రం ఈ విధానం తీసుకొచ్చింది. ఇంకా లింక్ చేయని వారు సమీప రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో చేసుకోవచ్చు. ఆధార్, రేషన్ కార్డుతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.

Spread the love

Related News

Latest News