ప్రతిపక్షం, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. బస్సులోపల చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు కాపాడారు. బస్సు హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెంచికులపాడు సమీపంలో ఉన్న విశ్వభారతి హాస్పిటల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమా లేక నిద్రమత్తా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.