ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్ కు గురై ఓయువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలంలోని బీర్నంది అనుబంధ ఇప్పగూడా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్ శుక్రవారం ఇంటి ఆవరణలో ఉన్న బోరు మోటర్ పనిచేయకపోవడంతో దానిని రిపేర్ చేయడానికి బయటకు తీశాడు. ఈక్రమంలో విద్యుత్ షాకికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు
తెలిపారు. ఈ మేరకు ఖానాపూర్ మండల పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు
చేశారు.