Trending Now

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హరిహరి వీరమల్లు టీజర్ తొందరలో రీలీజ్ కానుందని తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇందులో పవన్ కళ్లు కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి ‘‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో’’ అంటూ రాసుకొచ్చారు. కాగా, ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

గతేడాది వకీల్ సాబ్‌తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ప‌వ‌న్.. ఈ ఏడాది భీమ్లా నాయ‌క్‌తో మ‌రో సూప‌ర్‌హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ప‌వ‌న్ కెరీర్‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చాయి. ప్ర‌స్తుతం ఈయ‌న హరి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News